టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు పెరగడం వల్ల సినిమాల బడ్జెట్లు భారీగా ఎక్కువవుతున్నాయి. దీనిపై నిర్మాత దిల్ రాజు తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రూ.300 కోట్ల బడ్జెట్ సినిమాలో 35-40 శాతం కేవలం హీరో రెమ్యునరేషన్‌కే సరిపోతుందని ఆయన అన్నారు. తమ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో టాప్ హీరోలు పారితోషికాలు తగ్గించుకోవడం లేదని ఆయన తెలిపారు.
ఈ క్రమంలో బాలీవుడ్ హీరోల పనితీరును ఆయన ఉదాహరణగా చెప్పారు. అక్కడ స్టార్స్ అందరూ ముందస్తు రెమ్యూనరేషన్ కాకుండా ‘ప్రాఫిట్ షేరింగ్’ (లాభాల్లో వాటా) పద్ధతిని పాటిస్తున్నారని, మన టాలీవుడ్లో కూడా ఈ విధానం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఒకప్పుడు రూ.130 కోట్లు తీసుకునేవారని, కానీ మార్కెట్ పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆయన కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని దిల్ రాజు పేర్కొన్నారు. ఈ మోడల్ వల్ల నిర్మాతలకు భారం తగ్గి, హీరోలలో కూడా బాధ్యత పెరుగుతుందని ఆయన వివరించారు.
The put up హీరోల రెమ్యూనరేషన్ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
