Wed. Apr 22nd, 2026

రాయలసీమ భరత్ హీరోగా నటిస్తూ, సంతోష్‌తో కలిసి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘జగన్నాథ్’. భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పీలం పురుషోత్తం నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. హీరో భరత్ విభిన్నమైన రీతిలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్లలో హీరో మాస్ లుక్, రక్తపు మరకలతో ఉన్న తీరు చూస్తుంటే ఇది పక్కా యాక్షన్ సినిమాగా కనిపిస్తోంది. మరోవైపు హీరోయిన్లతో రొమాంటిక్ యాంగిల్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి షేక్ వలి, క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ మోపూరి సంగీతం సమకూర్చారు.

The submit రాయలసీమ భరత్ ‘జగన్నాథ్’ చిత్ర విడుదల తేదీ ఖరారు first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.