Fri. Jul 31st, 2026
Rohit Shetty: ముంబయిలో కాల్పుల కలకలం.. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దుండగుల దాడి!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగుడు హల్‌చల్ చేశాడు. జుహు ప్రాంతంలోని ఆయన ఇంటిపై సుమారు 12 గంటల సమయంలో దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం నిందితుడు బైక్‌పై పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

Additionally Learn : Vijay-Rashmika :రేపే విజయ్ – రష్మిక వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!

సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఐదు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి పోలీస్ కమిషనర్ దేవన్ భారతి ఈ ఘటనను ధృవీకరించారు. రోహిత్ శెట్టి నివాసం వద్ద భారీ భద్రతను మోహరించిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ‘సింగం’, ‘గోల్‌మాల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడిపై ఇలాంటి దాడి జరగడంతో బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రస్తుతం ఆయన ‘గోల్‌మాల్ 5’ పనుల్లో బిజీగా ఉండగా ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది.