బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh ) నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించి, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ 2’ ఈ ఏడాది మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో పాటు ఆయన ‘ప్రళయ్’ అనే జోంబీ థ్రిల్లర్‌లో కూడా నటిస్తున్నారు.
మరోవైపు, రణవీర్ సింగ్ సౌత్ ఇండియన్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు చేయబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దిగ్గజ దర్శకుడు శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’లో రణవీర్‌ను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. అదేవిధంగా, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా రణవీర్ సింగ్‌తో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్.
అయితే, రణవీర్ ప్రస్తుతం తన ఫిల్మోగ్రఫీలో వైవిధ్యం కోసం కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ భారీ కాంబినేషన్ల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ‘ధురంధర్ 2’ కూడా భారీ విజయాన్ని అందుకుంటే, ఆయన ‘ధురంధర్ 3’పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన తన పూర్తి సమయాన్ని ‘ప్రళయ్’ మరియు ‘ధురంధర్ 2’ ప్రమోషన్లకే కేటాయించినట్లు తెలుస్తోంది.
The publish ధురంధర్ ఎఫెక్ట్ : సౌత్‌పై రణ్‌వీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
