Fri. Jul 31st, 2026
Bollywood : ప్రియాంకను బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా ఇద్దరూ ఒకే రకమైన మనస్తత్వం ఉన్నవారని, వారిద్దరికీ తమ పని పట్ల విపరీతమైన క్రమశిక్షణ, సినిమా వ్యాపారంపై మంచి అవగాహన ఉందని నిర్మాత శైలేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. వెండితెరపై వీరిద్దరి జోడీ అద్భుతంగా ఉన్నప్పటికీ, బాలీవుడ్ వీరి కాంబినేషన్‌ను సరిగ్గా వాడుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షారుఖ్ లాగే ప్రియాంక కూడా ఏ విషయంలోనూ షార్ట్‌కట్స్ వెతక్కుండా, తన తెలివితేటలతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిందని, వీరిద్దరూ బాలీవుడ్‌కు నిజమైన ప్రతినిధులని ఆయన కొనియాడారు.

Additionally Learn : Vijay-Rashmika :రేపే ‘విజయ్ – రష్మిక’ వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!

అయితే, బాలీవుడ్ ప్రియాంక చోప్రాలోని అసలైన టాలెంట్‌ను గుర్తించడంలో విఫలమైందని శైలేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఆమెకు సరైన మద్దతు లభించకపోవడం.. ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్లే ఆమె హాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, ఇది హిందీ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టమని ఆయన పేర్కొన్నారు. కేవలం కొందరి చేతుల్లోనే ఇండస్ట్రీ పవర్ ఉండిపోవడం వల్ల ప్రియాంక వంటి మేధావిని మనం కోల్పోయామని, ఆమెకు ఇక్కడ దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయన స్పష్టం చేశారు.