Fri. Jul 31st, 2026

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య, జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ సినిమా డిసెంబర్ 2025లో విడుదలైంది. ఈ సినిమాకి థియేటర్లలో సాధారణ స్పందన లభించినా.. పాన్-ఇండియా స్థాయిలో ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మెరుగైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ తేదీని కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 8, 2026న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

కాగా ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. పైగా ఈ ‘గుర్రం పాపిరెడ్డి’ లో ప్రధాన పాత్రలందరూ మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. అలాగే అక్కడక్కడా మంచి ఫన్ ట్రాక్స్ ఇందులో బాగున్నాయి. మరి టెలివిజన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి.

The submit టెలివిజన్ ప్రీమియర్ తేదీని ఫిక్స్ చేసుకున్న ‘గుర్రం పాపిరెడ్డి’ ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.