Tue. Apr 21st, 2026

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో NBK111 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లా్న్ చేస్తోంది.

కాగా, ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ చిత్రాన్ని దసరాకు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా, బాలయ్య ఇప్పుడు మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల డైరెక్షన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విజయ్ కనకమేడల బాలయ్యకు కథను వినిపించాడని.. దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుందట.

The publish మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెడుతున్న బాలయ్య.. డైరెక్టర్ ఎవరంటే..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.