Tue. Apr 21st, 2026
NBK111: బాలకృష్ణ సరసన నయనతారతో పాటు మరో స్టార్ హీరోయిన్..

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలుకాబోతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ‘వీరసింహా రెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకు #NBK111 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ యాక్షన్ డ్రామా సెట్స్ పైకి వెళ్లినట్లు వార్తలు వస్తుండగా, వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమాలకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోసే ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని హీరోయిన్ల కాస్టింగ్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Additionally Learn : Biker OTT: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’..!

ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు వినపడుతున్నప్పటికి. తాజా సమాచారం ప్రకారం, చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’లో నటించి మెప్పించిన కాజల్, మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక పక్కా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసిన గోపీచంద్, హీరోయిన్ల విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. బాలయ్యను సరికొత్త మాస్ లుక్‌లో చూపించేందుకు ఈ టీమ్ గట్టిగానే కసరత్తు చేస్తోంది.