టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన నెక్స్ట్ చిత్రం ‘డెకాయిట్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, శేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో #AskSesh సెషన్‌లో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు థ్రిల్లర్ జోనర్ నుండి ఎప్పుడు బయటకు వస్తారు?’ అని ప్రశ్నించగా, శేష్ స్పందిస్తూ.. ‘డెకాయిట్’ ఆ మార్పు కోసమే చేస్తున్నానని బదులిచ్చాడు. ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదని, ఒక అందమైన ప్రేమకథ అని ఆయన వివరించారు. భావోద్వేగాలతో సాగే ఈ చిత్రానికి ‘ప్రేమ’ అనేదే ప్రధానాంశమని శేష్ క్లారిటీ ఇచ్చాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘హిట్-2’ వంటి వరుస థ్రిల్లర్ల తర్వాత శేష్ ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 10న బాక్సాఫీస్ వద్ద శేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
The submit ‘డెకాయిట్’తో అడివి శేష్ వాటికి గుడ్ బై చెబుతున్నాడా..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
