మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ దర్శకుడు రంజిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇడుక్కి జిల్లాలో అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. షూటింగ్ సమయంలో కారవాన్‌కు పిలిపించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొనడంతో, కొచ్చి సిటీ పోలీసులు కేసు నమోదు చేసి తోడుపుజా పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపడుతున్నారు.
మలయాళ సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికలోనూ రంజిత్ పేరు ఉండటం గమనార్హం. గతంలో 2024లోనూ ఒక బెంగాలీ నటి ఈయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2009లో ‘పాలేరి మాణిక్యం’ సినిమా ఆడిషన్స్ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె కొచ్చి పోలీస్ కమిషనర్ వద్ద ఫిర్యాదు చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు అత్యంత రహస్యంగా ఈ అరెస్టు ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రస్తుతం దర్శకుడు రంజిత్ పోలీసుల అదుపులో ఉండగా, మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మలయాళ పరిశ్రమలో ప్రముఖులపై వరుసగా కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
The publish డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
