Wed. Apr 22nd, 2026

రీసెంట్ గా అవైటెడ్ బిగ్గెస్ట్ సినిమా జన నాయగన్ థియేటర్స్ లో విడుదల కాకుండానే ఆన్లైన్ లో సినిమా మొత్తం లీక్ కావడం షాకింగ్ గా మారింది. దీనితో దక్షిణాది సినిమా నుంచి అనేకమంది బిగ్ స్టార్స్ ఈ లీక్ ని ఖండించి మేకర్స్ కి అండగా నిలబడ్డారు. అయితే దళపతి విజయ్ సైడ్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అభిమానుల్లో కూడా కొంచెం మిక్స్డ్ గా మారింది.

కానీ లేటెస్ట్ గా ఈ భారీ నష్టం విషయంలో హీరో విజయ్ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్ వారికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది. తమకి జరిగిన నష్టానికి తన వంతుగా ఏమైనా చేసేందుకు సిద్ధం అని తను హామీ ఇచ్చాడట. దీనితో మరో సినిమా వారు ఓకే చేసుకుంటే బెటర్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నిజానికి జన నాయగన్ విజయ్ ఆఖరి సినిమా వారు చేసే సువర్ణావకాశం దక్కించుకున్నారు. కానీ అదే ఊహించని రీతిలో ప్రతికూలంగా మారింది. సో విజయ్ తన వైపు నుంచి వారికి అండగా ఉండేందుకు రెడి అయినట్లు వచ్చిన ఈ కొత్త పుకారులో ఎంత మేర నిజం ఉందో చూడాల్సిందే.

The put up ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.