మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సెన్సేషనల్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
అయితే ఈ చిత్రం అటు థియేట్రికల్ ఇటు నాన్ థియేట్రికల్ గా కూడా భారీ హిట్ గా ఈ సినిమా నిలిచింది. మరి లేటెస్ట్ గా ఈ సినిమా 100 రోజుల రన్ ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుల్లో 100 రోజుల రన్ అనేది చాలా అరుదైన అంశమే అని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు సెంటర్స్ లో 100 రోజుల రన్ ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
యర్లకుంట, మైదుకూరు ప్రాంతాల్లో మన శంకర వరప్రసాద్ గారు 100 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకొని ఈ రోజుల్లో రేర్ ఫీట్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో వెంకీ మామ సాలిడ్ క్యామియోలో నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.
The publish 100 రోజుల రన్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఎన్ని సెంటర్స్ లో అంటే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
