Tue. Apr 21st, 2026

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “జైలర్ 2”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వచ్చిన మొదటి పార్ట్ ఎలాంటి సెన్సేషన్ సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు.

సినిమా తాలూకా మొత్తం షూట్ ని ఇప్పుడు కంప్లీట్ చేసినట్టు మేకర్స్ సెట్స్ నుంచి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ తో రివీల్ చేశారు. సో జైలర్ పార్ట్ 2 షూట్ మొత్తం పూర్తయ్యింది. ఇక రిలీజ్ డేట్ ఒక్కటి మాత్రమే బాకీ ఉందని చెప్పాలి. ఇదెప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ఈసారి కూడా పలు ఊహించని క్యామియోలు ఉంటాయనే టాక్ ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The publish ‘జైలర్ 2″ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్.. ఇక విడుదలే బాకీ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.