మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన భారీ చిత్రం “డ్రాగన్” ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో ప్రస్తుతం బిజీగా కొనసాగుతున్న తారక్ ఇప్పుడు దానికి కొంచెం బ్రేక్ ఇవ్వడం జరిగింది.
తాజాగా తారక్ మరియు తన సోదరుడు కళ్యాణ్ రామ్ నందమూరి వారి తాత, తెలుగు సినిమా సీనియర్ దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ తెల్లవారు జామున కనిపించారు. నేడు ఆ దిగ్గజ నటులు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద హాజరై తమ వివాళులు ఆ మహనీయునికి అర్పించి కొద్ది సేపు అక్కడ గడిపి బయలుదేరారు.
అయితే అక్కడ ఉన్నంతసేపు తారక్ ఎంతో భావోద్వేగంతో కనిపించిన దృశ్యాలు ఇపుడు అభిమానుల్లో, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే అక్కడ అభిమానులు తారక్ పై జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు కూడా చేయడం వైరల్ గా మారింది.
Tarak @tarak9999 anna at NTR Ghat
Johar NTR pic.twitter.com/9WSj0rd5LF
— poorna_choudary (@poornachoudary1) Might 28, 2026
The put up వైరల్ వీడియో: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ విజువల్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
