Thu. May 28th, 2026

విడుదల తేదీ : మే 28, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అజయ్, మాస్టర్ మహేంద్ర, ఆమెని, దేవి ప్రసాద్, తనికెళ్ళ భరణి తదితరులు
దర్శకత్వం&కూర్పు : మణి తెల్లగూటి
నిర్మాణం : రాధికా శ్రీనివాస్
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, షాజిత్
ఛాయాగ్రహణం : పవన్ చెన్నల్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘త్రికాల’ కూడా ఒకటి. మాస్టర్ మహేంద్ర, శ్రద్దా దాస్, అజయ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

సనాతన ధర్మంలో భాగమైన పునర్జన్మలు, కర్మ ఫలం ప్రధానంగా ఈ కథ ఇతిహాసాల నుంచి మొదలవుతుంది. ఇలా కొన్ని వందల ఏళ్ల కితం గోవధ చేసిన కారణంగా ఓ రాజ వంశం శాపగ్రస్తమై వారి వంశంలో పుట్టే మగ సంతానం ఒక వైకల్యంతో పుట్టడం జరుగుతుంది. అలా ఆ వంశంలో చివరి వారసుడు వైతరన్ (అజయ్) పుట్టిన తర్వాత ఏమైంది? ఈ క్రమంలో అనకాపల్లికి చెందిన యువకుడు శివ (మాస్టర్ మహేంద్ర) కి కాల్ లో పరిచయం అయ్యిన నిధి (సాహితీ) ఎవరు? శాపగ్రస్తమైన శంకరంపల్లి అనే గ్రామాన్ని కాపాడేది ఎవరు? ఈ క్రమంలో కొందరు మాంత్రికులు ఒక అండంలో బంధించబడ్డ త్రికాలుని ఆత్మని ఎందుకు మళ్లీ మేల్కొల్పాలని చూస్తారు? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి .

ప్లస్ పాయింట్స్:

మంచి ఫాంటసీ సబ్జెక్ట్ లు ఒకింత కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ త్రికాల సినిమాలో కోర్ పాయింట్ నచ్చవచ్చు. దీనికి అనుగుణంగా సినిమా మొదలైన కొన్ని నిమిషాల కథనం, బ్యాక్ స్టోరీ అలానే త్రికాలుని కాన్సెప్ట్ వంటివి నరేట్ చేయడం ఆసక్తిగా అనిపిస్తాయి.

అలాగే సెకండాఫ్ కొంచెం ఇందులో బెటర్ అని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయి. పైగా నటి ఆమనిపై డిజైన్ చేసిన ఎమోషనల్ ఎపిసోడ్ మరియు ఒక పాట చాలా బాగున్నాయి. ఆమె పాత్రలో ఆమని చాలా బాగా చేసారు. ఇక ఆమెతో పాటుగా నటుడు అజయ్ పవర్ హౌస్ పెర్ఫామెన్స్ అందించారు అని చెప్పొచ్చు.

తన రోల్ లేట్ గానే రివీల్ అవుతుంది కానీ తన పాత్రని దర్శకుడు డిజైన్ చేసుకున్న విధానం కానీ అందులో నటించిన అజయ్ అలానే బాల నటుడు సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు. వీటితో పాటుగా తనికెళ్ళ భరణి, మాస్టర్ మహేంద్ర, శ్రద్దా దాస్ ఇతర నటీనటులు కూడా బాగానే చేసారు. అలానే ఫస్టాఫ్ లో మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫాక్టర్ కొంత వరకు ఓకే అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఒక కొత్త సబ్జెక్ట్ ని చెప్పాలనుకున్న ఆలోచన ప్రయత్నం బాగానే ఉన్నాయి కానీ ఈ క్రమంలో డిజైన్ చేసుకున్న కథనం మాత్రం కొన్ని చోట్ల రెగ్యులర్ గా మరికొన్ని చోట్ల కన్ఫ్యూజన్ గా సాగింది అని చెప్పక తప్పదు. మెయిన్ గా ఫస్టాఫ్ లో కథనం అంతా ఒక చోట నుంచి మరో చోటికి కట్ అవుతూ వెళుతూ కన్ఫ్యూజన్ గా సాగుతుంది.

వీటికి క్లారిటీ సెకండాఫ్ లో ఇచ్చారు కానీ దాని కోసం ఫస్టాఫ్ ని ఓవర్ బిల్డప్ ఇస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సాగదీశారు. అలాగే సెకండాఫ్ లో కొంత సమయం తర్వాత కథనం ఒకింత రొటీన్ సైకో పాత్ స్టైల్ లోకి మారింది అనిపిస్తుంది. కానీ దీనికి ఫాంటసీ, ఇతిహాసాల అంశాలు జోడించడం సేవ్ చేసే అంశాలు అయ్యాయి.

అలానే అజయ్ రోల్ పై కర్మ ఫలితాన్ని వివరించిన తీరు ఇంకాస్త బెటర్ గా క్లారిటీగా ఉంటే బాగుండు. వీటితో పాటుగా ఈ సినిమా పూర్తిగా తమిళ్ సినిమాలా ఉండదు అలాగని తెలుగు సినిమాలా కూడా ఉండదు. వీటితో సినిమాలో నాచురలిటీ మిస్సైనట్టు కనిపిస్తుంది. అలానే చాలా పాత్రలు డైలాగ్స్, లిప్ మూమెంట్ కి సింక్ లేనే లేదు. ఇవన్నీ కథనంలో ఆడియెన్స్ ని లీనం కాకుండా చేస్తాయి. ఇంట్రెస్టింగ్ గా అజయ్ కి కూడా సొంత డబ్బింగ్ లేకపోవడం మరో డిజప్పాయింట్ చేసే అంశం.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు అనుకోవచ్చు. ఫాంటసీ సబ్జెక్టుకి కావాల్సిన సెటప్, విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల ఓకే కానీ మరికొన్ని చోట్ల ఏఐ పై ఆధారపడ్డారు. సంగీతం పర్వాలేదు. అమ్మ పాట బాగుంది. కెమెరా వర్క్ కూడా ఒకే. దర్శకుడే ఎడిటింగ్ కూడా చేసారు. ఈ వర్క్ కొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు మణి తెల్లగూటి విషయానికి వస్తే.. తన కాన్సెప్ట్ ఎంపిక బాగుంది. అలానే చెప్పాలనుకున్న పాయింట్ దాదాపు బాగానే చెప్పే ప్రయత్నం చేశారు కానీ అందులో కన్ఫ్యూజన్ గా కొంతమేర నడిపించడం మాత్రం సినిమాని కొన్ని చోట్ల బోర్ గా మార్చింది. అలానే టెక్నికల్ గా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘త్రికాల’ సినిమాలో కోర్ కాన్సెప్ట్ బాగానే ఉంది అలాగే అజయ్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. సెకండాఫ్ లో కూడా కథనం కొంచెం బెటర్ అనిపిస్తుంది. కానీ ఫస్టాఫ్ లో కన్ఫ్యూజ్ చేసే కథనం, కొన్ని రొటీన్ అంశాలు డిజప్పాయింట్ చేస్తాయి. వీటితో మంచి పోటెన్షియల్ ఉన్న ఈ ఫాంటసీ డ్రామా కేవలం కొంతమేర ఓకే అనిపిస్తుంది.

123telugu.com Ranking: 2.5/5

Reviewed through 123telugu Workforce

The publish సమీక్ష: ‘త్రికాల’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.