Thu. May 28th, 2026
Suriya : ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్. ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై టాలీవుడ్, కోలీవుడ్‌లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు.

ఈ  ఆగస్టు 14 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం లాంగ్ వీకెండ్ కావడంతో మేకర్స్ ఈడేట్ ను లాక్ చేసారు. ఇటీవల కరుప్పు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అనుకున్న సూర్య అదే జోష్ లో విశ్వనాధం అండ్ షన్స్ ను రిలీజ్ చేసి హిట్ కొట్టాలని చుస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాలిడ్ రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో సూర్య సరసన  యంగ్ సెన్సేషన్ మమితా బైజు  హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్స్ రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తమిళ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్  ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్న ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!