తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీ ‘కరుప్పు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. సూర్య కెరీర్‌లో ఈ సినిమా సాలిడ్ హిట్‌గా నిలిచి ఆయనకు చాలా రోజుల తర్వాత ఓ బ్లాక్‌బస్టర్ హిట్ అందించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్స్ట్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు ఈ హీరో.
దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఎమోషన్స్, డ్రామా, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.
ఈ వైబ్రెంట్ పోస్టర్‌లో సూర్య ఒక డెప్త్ ఉన్న రోల్‌లో కనిపిస్తాడు. ఈ ఏడాది పండుగ సీజన్‌కు వస్తున్న అతిపెద్ద క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
The publish సాలిడ్ డేట్‌కు ఫిక్స్ అయిన సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
