మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో చరణ్ పెద్ది పెహల్వాన్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఆడియో జూక్‌బాక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘మస్సా మస్సా’ అనే స్పెషల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇటీవలే భోపాల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ అండ్ టీమ్ ఈ పాట హిందీ వెర్షన్‌ను లైవ్‌లో పర్ఫార్మ్ చేయగా, ఇప్పుడు చిత్రబృందం తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ ఎమోషనల్ & సోల్‌ఫుల్ ట్రాక్‌ను ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా ఆలపించాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.
Click on Right here For Video
The put up ఫ్యాన్స్ కోసం ‘పెద్ది’ మ్యూజికల్ ట్రీట్.. మోస్ట్ అవైటెడ్ సాంగ్‌తో వచ్చేసిన జూక్‌బాక్స్..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
