రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియడ్ డ్రామా ‘ఫౌజీ’ని డిసెంబర్ 3న విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘రాజా సాబ్’ డిజాస్టర్‌తో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే టైటిల్ గ్లింప్స్ మినహా ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో గ్రౌండ్ లెవెల్ బజ్ తక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది.
పాన్-ఇండియా రేంజ్‌లో క్రేజ్ రావాలంటే ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల తరహాలోనే ‘ఫౌజీ’ నుండి కూడా వెంటనే ఒక చార్ట్‌బస్టర్ సాంగ్ వదలాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే దేశభక్తి, రొమాంటిక్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ మొదటిసారి సోల్జర్ పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. హను రాఘవపూడి మార్క్ ఎమోషనల్ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
The put up ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా.. మేకర్స్ ఇక త్వరపడాల్సిందేనా..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
