Mon. Jun 29th, 2026

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “విశ్వంభర”. వాస్తవానికి ఈ చిత్రం జనవరి 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు, కానీ, ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మరి ఈ గ్రాండ్ ఫాంటసీ డ్రామా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి అయిందని.. ఆ విజువల్స్ ను టీమ్ అంతా చూసిందని.. మెగాస్టార్ చిరంజీవి కూడా చూశారని.. చిరుకి కూడా ఆ విజువల్స్ బాగా నచ్చాయని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

The put up మెగాస్టార్ ‘విశ్వంభర’ పై కొత్త అప్ డేట్ ! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.