దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ యానిమేషన్ చిత్రోత్సవానికి హాజరైన రాజమౌళి… అక్కడి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘వారణాసి’ కథకు మూలం తండ్రీ తనయుల మధ్య భావోద్వేగమే. అలాగే, ‘ఆఫ్రికా అరణ్యాలు, అంటార్కిటికా మంచు ప్రాంతాలతోపాటు… రామాయణంలోని దేవుళ్లు, జాతీయ విపత్తుల్ని, ఫాంటసీతో కూడిన అద్భుతమైన అంశాల్ని ఈ ఒక్క చిత్రంతోనే ప్రేక్షకులు అనుభూతి చెందేలా ప్లాన్ చేస్తున్నాం’ అని రాజమౌళి తెలిపాడు.
కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
The publish వారిద్దరి మధ్య భావోద్వేగమే ‘వారణాసి’ – రాజమౌళి first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
