Mon. Jul 6th, 2026

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఈ సినిమా జులై 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో భారీస్థాయిలో ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలోనే అఖిల్ కొత్త పేరు ‘నాగ అఖిల్’ గురించి చెప్పడం, అది కాస్త బాగా వైరల్ కావడం తెలిసిందే.

ఐతే, ‘నాగ అఖిల్’ పేరులో అక్కినేని కుటుంబానికి చెందిన నలుగురు గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్నాయట. నాగ పదంలో అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జునల పేర్లు ఉంటే.. అఖిల్ పేరులోని మొదటి అక్షరాల్లో అన్నపూర్ణమ్మ, అమల పేర్ల సెంటిమెంట్ దాగి ఉందట. మొత్తానికి అక్కినేని వంశంలోని నలుగురు ముఖ్యుల ఆశీస్సులు, ప్రతిబింబం ఈ ఒక్క పేరులోనే కనిపిస్తాయని ఈ పేరు పెట్టిన అభిమాని తెలిపారు. మరి ఈ పేరు అఖిల్ కి ఏ స్థాయిలో సక్సెస్ ను ఇస్తోందో చూడాలి.

కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వచ్చిందని టీమ్ చెబుతుంది.

The submit ‘నాగ అఖిల్’ పేరులో నలుగురి పేర్లు ! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.