వెండితెరపై హీరోలకు ఉండే స్టార్ డమ్ వేరు. సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పురుషాధిక్యత, లింగ వివక్షపై చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు హీరోయిన్లకు తగిన గుర్తింపు ఉండటం లేదు అని టాక్. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ.. ‘సెట్స్‌పై ఉండే మేనేజ్మెంట్కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే, వాళ్ళను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ, హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్‌పై కూర్చోబెడతారు’ అని ఆమె తెలిపింది.
కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. చాలాసార్లు హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం మాకు దక్కదు. చెప్పింది చెయ్’ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే, హీరోయిన్లు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదని, నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నాను అని ఆమె తెలిపింది.
The put up మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు – కృతి సనన్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
