నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ 111వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో స్టార్ట్ చేసిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా షూట్ లో బాలయ్య గాయపడ్డారు అనే వార్త ఒకింత షాకింగ్ గా మారింది. దీనితో అభిమానులు, సినీ ప్రముఖులు కూడా బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆశించారు.
ఇక ఇదిలా ఉండగా బాలయ్య అడ్మిట్ అయ్యిన హాస్పటల్ ఏ ఐ జీ సంస్థ వారు లేటెస్ట్ గా బులెటిన్ విడుదల చేసి ప్రస్తుతానికి ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి బాలయ్య ఎడమ కాలి మోకాలి కండరం వద్ద అయ్యిన గాయం పైనే కీళ్ల శస్త్రచికిత్స వైద్యులుతో విచారణ జరుగుతుంది అని మొత్తంగా బాలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం మెడికల్ అబ్జర్వేషన్ లోనే కొనసాగుతున్నారని ట్రీట్మెంట్ ప్లాన్ ని ప్రస్తుతం కొనసాగుతున్న అబ్జర్వేషన్ పిమ్మట తెలుపుతామని తెలిపారు. సో బాలయ్య అభిమానులు ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు.
The submit బాలయ్య ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్.. బులెటిన్ తో క్లారిటీ ఇచ్చిన హాస్పిటల్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
