Thu. Jul 23rd, 2026

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన ఇప్పటికే ఫౌజీ, స్పిరిట్, కల్కి సీక్వెల్ చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ కాప్ డ్రామా ‘స్పిరిట్’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ కాప్ పాత్రలో ప్రభాస్ విధ్వంసం సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించబోతున్నట్లు ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్‌లో ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన కత్రినా, ఆ తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తల్లిగా మారిన తర్వాత తన కమ్ బ్యాక్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ‘స్పిరిట్’ వంటి సినిమాలో ఛాన్స్ వస్తే, ఆమె తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి నిజంగానే ‘స్పిరిట్’లో కత్రినాకు ఛాన్స్ లభిస్తుందా.. ఆమె నిజంగానే ప్రభాస్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందా.. అనేది వేచి చూడాలి.

The submit ప్రభాస్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ‘మల్లీశ్వరి’..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.