Thu. Jul 23rd, 2026

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ‘వారణాసి’ అనే ప్రెస్టీజియస్ చిత్రంలో నటిస్తున్నాడు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, మహేష్ ఓ డైరెక్టర్‌ను పిలిచి మరీ అవకాశం ఇస్తే, ఆ డైరెక్టర్ కథ లేకపోవడంతో మహేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటిన దర్శకుడు అజయ్ భూపతిని అప్పట్లో మహేష్ పిలిచి అభినందించాడట.

అయితే, తన వద్ద ఏదైనా కథ ఉందా అని మహేష్ అడగ్గా, శ్రీకృష్ణదేవరాయుల బ్యాక్‌డ్రాప్‌తో ఓ కథ ఉందని చెప్పాడట. కానీ, తనకు ఓ కమర్షియల్ కథ ఉంటే చెప్పాలని మహేష్ సూచించాడట. అజయ్ గనక శ్రీకృష్ణదేవరాయులు నేపథ్యంలోని కథను మహేష్‌తో ఒప్పించి ఉంటే, ఈపాటికి ఆ హిస్టారికల్ పాత్రలో మహేష్ కనిపించేవాడు. కానీ, మహేష్‌ను ఇంప్రెస్ చేయకపోవడంతో అజయ్ భూపతి ఓ బిగ్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.

The submit హిస్టారికల్ పాత్రలో మహేష్ బాబు.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న డైరెక్టర్..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.