జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశాడు. ఈ వేడుకలో తనదైన శైలిలో మాట్లాడిన చిరు, చిత్ర యూనిట్‌కు అండగా నిలుస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. కిరణ్ అబ్బవరంను అభినందించిన చిరు.. కిరణ్ తనకోసం పనిచేసినప్పటికీ, అతని తమ్ముడు మాత్రం పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ చిరు వేదికపై వేసిన సరదా కామెంట్స్ ప్రేక్షకులను నవ్వించాయి.
ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం రాత్రుళ్లు మాత్రమే కాకుండా పగటిపూట కూడా కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు నిరంతరం కష్టపడాలని ఆయన పిలుపునిచ్చాడు. మణిశర్మ అందించిన సంగీతాన్ని, దర్శకుడు రవి నంబూరి ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. మరో ఇరవై నాలుగు గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాకు మెగాస్టార్ హాజరు అదనపు బలాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడం, ప్రీమియర్లు వేస్తుండటంతో సినిమాపై నమ్మకం కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
The put up ‘చెన్నై లవ్ స్టోరీ’పై చిరు కామెంట్స్.. ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఖాయం అంటున్న మెగాస్టార్..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
