Mon. Jul 27th, 2026

హీరోయిన్ ‘రకుల్‌ ప్రీత్‌ సింగ్‌’ 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’ ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. అనంతరం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువై, లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. మొత్తానికి తెలుగు సినిమాలతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాంటి రకుల్ సినిమాల్లోకి అసలు ఎందుకు వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.

కారు కొనాలనే కోరికతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తొలి సినిమాలో నటించిందట. రీసెంట్ గా ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించడం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ…‘నేను కాలేజీలో చదివే రోజులు అవి. అప్పుడు అనుకోకుండా నాకు కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ అవకాశం వచ్చింది. ఆ సినిమాకి వాళ్లు రూ.5 లక్షల పారితోషికం ఇస్తాం అంటే.. ఆ డబ్బుతో కారు కొనుక్కోవాలనే ఆశతో నేను ఆ సినిమా చేశాను’ అంటూ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చెప్పుకొచ్చింది.

The put up ఆ ఆశతోనే ఆ సినిమా చేశా – రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.