Mon. Jul 27th, 2026

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, హిందీ క్రేజీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని.. ఇప్పటికే అతన్ని ఈ చిత్ర యూనిట్ అప్రోచ్ అయిందని.. ఓ కీలక పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి తర్వాత చేయనున్న షెడ్యూల్ లో అతని పార్ట్ ను షూట్ చేస్తారట.

అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ ఫ్లాష్ బ్యాక్ కోసం అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

The submit ‘డ్రాగన్’లో బాలీవుడ్ క్రేజీ నటుడు ? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.