Mon. Jul 27th, 2026

కోలీవుడ్ నుంచి ఈ ఏడాది రానున్న పలు క్రేజీ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సెన్సేషనల్ సీక్వెల్ సినిమా “జైలర్ 2” కూడా ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 15న గ్రాండ్ గా విడుదల కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కానీ అప్పటికే ఆ తర్వాత రోజు డేట్ కి కోలీవుడ్ స్టార్ నటుడు రజినీకి చాలా దగ్గర హీరో ధనుష్ నటించిన ‘ఓం’ కూడా డేట్ అనౌన్స్ చేశారు.

దీనితో ఇక ఓం సినిమా పక్కకి తప్పుకున్నట్టే అని అంతా భావించారు కానీ మేకర్స్ నిన్న విడుదల చేసిన తెలుగు, హిందీ టీజర్ పోస్ట్స్ లో రిలీజ్ డేట్ ని ఖరారు చేసి జైలర్ 2 తో క్లాష్ ఉందని రివీల్ చేశారు. కానీ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పై వచ్చిన పోస్టర్ లో మాత్రం మళ్ళీ రిలీజ్ డేట్ మిస్ అయ్యింది.

పోస్టర్ లోనే కాకుండా పోస్ట్ లో కూడా డేట్ మిస్ చేయడంతో అభిమానులు ఇప్పుడు అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సోలోగా వస్తుందా లేక జైలర్ 2 తో క్లాష్ లో వస్తుందా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకార్ సంగీతం అందించగా ఈ ఫస్ట్ సాంగ్ జూలై 28 న విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు.

The put up కన్ఫ్యూజన్ లో పెట్టేసిన ధనుష్.. రజినీతో క్లాష్ ఉన్నట్టా? లేనట్టా? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.