నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ లో ఊహించని విధంగా బాలయ్య గాయానికి లోనైన సంగతి తెలిసిందే. దీనితో తనకి సర్జరీ వరకు వెళ్లే ఛాన్స్ ఉందని వచ్చిన వార్తలు కొంచెం అభిమానులని ఆందోళనకి గురి చేసాయి.
అయితే ఏ ఐ జి హాస్పిటల్స్ వారు విజయవంతంగా బాలయ్యకి సర్జరీ ముగించినట్టుగా గుడ్ న్యూస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, స్వయానా బాలయ్యకి బావ అయినటువంటి చంద్రబాబు నాయుడు బాలయ్యని ఏ ఐ జి ఆసుపత్రిలో కలవడం ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య క్యాప్ పెట్టుకొని మంచి ఎనర్జిటిక్ గా కనిపిస్తూ బాలయ్య, చంద్రబాబుతో కలిసి మాట్లాడుతున్న ఫోటో బయటకి వచ్చి ఫ్యాన్స్ లో జోష్ నింపింది. దీనితో సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారింది.
The put up వైరల్ పిక్: బావ బాలయ్యని పరామర్శించిన సీఎం చంద్రబాబు! ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
