ఎప్పుడు చాలా సాఫ్ట్ గా సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలన స్టేట్మెంట్స్ తో షాకివ్వడం వైరల్ గా మారింది. ఇటీవల అనౌన్స్ చేసిన జాతీయ అవార్డుల లిస్ట్ లో తన ‘రాయన్’ సినిమాకి జాతీయ అవార్డు రావడంపై చాలా నెగిటివ్ వచ్చింది. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి కానీ ఆ సినిమాకి ఎలా ఇస్తారు అని తనపై ఘాటుగానే కామెంట్స్ వినిపించాయి.
కానీ వీటిపై ధనుష్ ఈసారి సైలెంట్ గా ఉండలేదు. జాతీయ అవార్డు విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి. తన రాయన్ కంటే ఆ ఏడాదిలోనే వచ్చిన ‘మహారాజా’, ‘సత్యం సుందరం’ వంటి సినిమాలు బెటర్ కావచ్చు కానీ నా సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ అదే వీళ్ళు తాను కూడా వాడా చెన్నై, కర్ణన్, మర్యన్ లాంటి సినిమాలు చేసి అవి కూడా జాతీయ అవార్డుకి అర్హమైనవి అయినపుడు ఎందుకు ఎవరూ మాట్లాడలేదు అని ఒకింత షాకింగ్ గా ఇప్పుడు మారింది.
దీనితో పాటుగా తన నుంచి మరో ఊహించని మూవ్ కూడా ఉండేలా ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వేల్స్ మెడికల్ కాలేజ్ లో నిర్వహించిన మెగా రక్తదాన కార్యక్రమానికి హాజరైన ధనుష్ ఇచ్చిన మరో స్టేట్మెంట్ రాజకీయాల్లోకి తాను కూడా వస్తాడా అనే మాటని హైలైట్ చేస్తున్నాయి.
“ఇంత మంది ప్రజలు ఒకే చోటకి చేరారు. ఈ విధమైన ఐక్యతకు ఒక శక్తి ఉంటుంది, మీరు ఆ ఐక్యతకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి.. కేవలం ఆడియో విడుదల కార్యక్రమాలు, సమావేశాలతోనే సరిపెట్టుకోవద్దు. చేతులు కలిపి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయండి.. మీ ప్రాంతంలోని ప్రజలకు, మీ ఇంటి చుట్టుపక్కల నివసించే కుటుంబాలకు మీరు చేయగలిగినంత సహాయం చేయండి.. మీ అందరినీ చూసి నేను మరింత గర్వపడాలనుకుంటున్నాను. మీరందరూ అలా చేస్తారని ఆశిస్తున్నాను.” అని ధనుష్ చెప్పడంతో తాను పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడా అంటూ కోలీవుడ్ వర్గాలు ఆల్రెడీ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సో ఇలా ధనుష్ నుంచి ఈ రెండు సంచలన స్టేట్మెంట్స్ వైరల్ గా మారాయి.
The put up ధనుష్ సంచలన వ్యాఖ్యలు వైరల్! అసలేమైందంటే? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
