Mon. Jul 27th, 2026

రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భుజానికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నట సింహం బాలకృష్ణ మోకాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న వార్త ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సర్జరీ కోసం కోయంబత్తూర్ వెళ్లినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారింది. ఇలా మన తెలుగు సినిమా అగ్ర తారలు విషయంలో ఇలాంటి వార్తలు వినడం అనేది అభిమానులకి ఒకింత కష్టంగానే ఉంటుంది.

అయితే పవన్ కి ఆఫ్ లైన్ అభిమానుల అత్యుత్సాహం వల్ల రెండు భుజాలకి సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ బాలయ్య, చరణ్ ల వెర్షన్ ఇది కాదు. చరణ్ ‘పెద్ది’ కోసం చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదు. ఆ క్రమంలోనే కుస్తీ సన్నివేశాలు చేసినప్పుడు తన మణికట్టు వద్ద గాయం అయ్యింది. అయినప్పటికీ తాను చిన్న కట్టుతో సినిమా ప్రమోషన్స్ చేసాడు.

అలాగే బాలయ్య తన 111 వ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో ఎలాంటి డూపు లేకుండా ఈ ఏజ్ లో కూడా డెడికేషన్ చూపిస్తూ వర్క్ చేయడంతో మోకాలి వద్ద గాయం తగిలి ఇటీవల సర్జరీ చేయించుకుని ఇప్పుడు కోలుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ కి కూడా రేపు జూలై 27న సర్జరీ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇలా మన టాలీవుడ్ స్టార్స్ సినిమా కోసం ఓ రేంజ్ లో కష్టపడి అభిమానుల కోసం రిస్క్ తీసుకుంటున్నారు. వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా అందుకుంటున్నారు.

The publish చరణ్ కి కూడా చిన్న సర్జరీ.. సినిమా కోసం టాలీవుడ్ స్టార్స్ కష్టం! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.