Fri. Jul 31st, 2026

శ్రీరామ్ (శ్రీకాంత్) కథానాయకుడిగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘ది మేజ్’. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం, తాజాగా తొలి పాటను విడుదల చేసింది.

ఆకట్టుకునే మెలోడీ ‘నన్నే నన్నే..’

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ఈ చిత్రం నుంచి ‘నన్నే నన్నే..’ అనే ఫస్ట్ సింగిల్‌ను అధికారికంగా విడుదల చేశారు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన స్వరాలకు విజయ్ కుమార్ సాహిత్యం జోడించగా, కపిల్ కపిలన్ ఆలపించారు. “నా ప్రాణం నీవే, నా ధ్యానం నీవే.. నన్నే నన్నే మనిషిగా గుర్తించావే..” అంటూ సాగే ఈ పాట, కథానాయిక పట్ల హీరోకు ఉన్న ప్రేమానురాగాలను ఆవిష్కరించేలా ఉంది.

ఉత్కంఠ రేపే సైకలాజికల్ థ్రిల్లర్

వాస్తవం, భ్రమల మధ్య ఉండే వ్యత్యాసాన్ని సరికొత్త కోణంలో చూపిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రతి క్షణం ప్రేక్షకుడి ఆలోచనలకు సవాలు విసిరేలా, ఒక విభిన్నమైన థ్రిల్లింగ్ అనుభూతిని ‘ది మేజ్’ అందిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.

ఈ చిత్రంలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్, డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The publish ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ‘ది మేజ్’ ఫస్ట్ సింగిల్.. పాట ఎలా ఉందంటే? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.