సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మధుర గాత్రంతో కోట్లాది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈ గాయని, సామాజిక అంశాలపై తను ఎలాంటి బిరుకు లేకుండా మాట్లాడుతూ.. తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మహిళల హక్కులు, లైంగిక వేధింపుల వంటి విషయాలపై చిన్మయి ఎప్పుడూ స్పష్టంగా స్పందిస్తూ, అన్యాయానికి ఎదురు నిలిచే ధైర్యవంతురాలిగా గుర్తింపు పొందారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
Additionally Learn : Kiara Advani : మీనా కుమారి బయోపిక్‌కి స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్..!
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ మళ్లీ సినిమాల్లో అవకాశాలు పొందుతున్న నేపథ్యంలో చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చిన్మయి ఇలా రాసుకొచ్చింది.. “సింగర్ కార్తీక్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌లాంటి వారిని మళ్లీ ఇండస్ట్రీలోకి తీసుకోవడం అంటే లైంగిక వేధింపులను ప్రోత్సహించడం లాంటిదే. అధికారం, డబ్బు ఉన్నవారు తమ ప్రాధాన్యాన్ని దుర్వినియోగం చేసినప్పుడు వారిని మళ్లీ అవకాశాలతో గౌరవించడం సరికాదు. కర్మ సిద్ధాంతం నిజమైతే, అది వారిని ఎప్పటికీ వదిలిపెట్టదు’ అంటూ రాసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీశాయి. చాలామంది నెటిజన్లు చిన్మయి ధైర్యాన్ని ప్రశంసిస్తూ “ఇలాంటి స్వరాలు సమాజానికి అవసరం” అంటుంటే, మరికొందరు ఆమె వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు.
గతంలో జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జానీ మాస్టర్ కొంతకాలం జైలులో ఉండి, తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ సినిమాల్లో, ఈవెంట్స్‌లో కనిపించడం ప్రారంభించడంతో చిన్మయి ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.
