Wed. Apr 22nd, 2026
Kantara 1 : కాంతార 1 ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన టీమ్

Kantara 1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార1 పై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఈవెంట్లతో మూవీ టీమ్ హంగామా చేస్తోంది. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ముంబైలో కూడా బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దాంతో పాటు చెన్నైలో కూడా కాంతార 1 ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కానీ కరూర్ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది దాకా చనిపోయారు.

Read Also : Rashmika Mandanna : జిమ్ లో కత్తిలాంటి అందాలకు చెమటలు పట్టిస్తున్న రష్మిక..

దాంతో చెన్నై ఈవెంట్ ను రద్దు చేశారు కాంతార టీమ్. బాధిత కుటుంబాలకు మూవీ టీమ్ తరఫున సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు కోలుకోవాలని కోరారు. ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకుని సహకరించాలని తెలిపారు. మూవీ రిలీజ్ అయ్యాక ఏదైనా సక్సెస్ మీట్ ఉండే ఉండొచ్చు. అప్పటి వరకు తమిళనాడులో ఎలాంటి ఈవెంట్లు ప్లాన్ చేయట్లేదు టీమ్. కాగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం రిషబ్ చాలా కష్టపడుతున్నాడు. మూవీపై భారీ అంచనాలు ఉండటంతో డే1 కలెక్షన్ల కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

Read Also : Srinidhi Shetty : సాయిపల్లవిపై శ్రీనిధి శెట్టి ఊహించని కామెంట్స్