Mon. Jun 29th, 2026
Kiran Abbavaram: సుకుమార్‌ – అబ్బవరమ్‌ కాంబో ఫిక్స్..!

టాలీవుడ్ యంగ్ హీరోలో కిరణ్‌ అబ్బవరం ఒకరు. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. చివరగా.. ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘కె-ర్యాంప్‌’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ‘చెన్నై లవ్‌ స్టోరీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా లైన్ లో ఇంకా పలు సినిమాలు ఉన్నాయట.

Also Read : Rukmini Vasanth : నా కెరీర్‌లో ప్రత్యేక పాత్ర ఇదే

అయితే, ఇప్పుడు కిరణ్‌ అబ్బవరంపై ఓ క్రేజీ న్యూస్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే ఆయన స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. కానీ ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏమిటంటే.. ఈ సినిమా డైరెక్టర్‌ స్వయంగా సుకుమార్‌ కాదు, ఆయన శిష్యుడు వీర. ఈ ప్రాజెక్ట్‌ను సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై నిర్మించబోతున్నారు. అంటే ఈ సినిమాకు సుకుమార్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. ఇది ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుందని, వచ్చే ఏడాది ఆరంభంలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.