Wed. Apr 22nd, 2026
Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద  దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నెల్సన్  దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్న ఆయన తన 173వ సినిమాను కూడా లైన్‌లో పెట్టారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక సంచలన మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. తొలుత ‘తలైవర్ 173’ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. రజనీకాంత్ కూడా సీబీ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి బయటకు రావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Additionally Learn : Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!

వినిపిస్తున్న సమాచారం ప్రకారం సిబి చక్రవర్తి స్థానంలో ‘ ఓ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికే రజనీకాంత్‌కు ఒక అద్భుతమైన కథను వినిపించానని అది సూపర్ స్టార్‌కి బాగా నచ్చిందని వెల్లడించారు. అశ్వత్ మేకింగ్ స్టైల్ మరియు ఆయన చెప్పిన కథలోని కొత్తదనం రజనీని ఆకట్టుకోవడంతో ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈ మార్పుపై చిత్ర యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితేఅశ్వత్ మరిముత్తు మరియు రజనీకాంత్ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.