Wed. Apr 22nd, 2026

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ సినిమానే రామాయణ. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆదరణ అందుకుంది. ఇక ఇక్కడ నుంచే మేకర్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ ని కూడా ముమ్మురం చేశారు.

ఇలా ఫేమస్ రోటెన్ టొమాటోస్ తో ఈ సినిమాలో రావణ పాత్రలో నటిస్తున్న నటుడు రాకింగ్ స్టార్ యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా రణబీర్ కి తనకి నడుమ ఇంకా ఎలాంటి సీన్స్ లేవని తెలిపారు. ఇది రెండు భాగాల సినిమా కావడం చిత్రంలో తమ ఇద్దరికీ రెండు రాజ్యాలు ఉంటాయని అలా అప్పుడే ఇద్దరి మధ్య సీన్స్ ఇంకా రాలేదని తాను తెలిపారు. కానీ సెట్స్ లో కలిసినప్పుడు మాత్రం తమ కలయిక ఎంతో గొప్పగా ఉంటుంది అని యష్ చెప్పడం వైరల్ గా మారింది.

The submit ‘రామాయణ’: రణబీర్ తో సీన్స్ పై యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.