Mon. Jun 29th, 2026

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ‘స్పిరిట్’ (Spirit) చిత్రంతో ఈ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

అయితే, ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మరికొద్ది గంటల్లో వస్తుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ట్వీట్ చేశారు. దీంతో కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ పోస్టర్ ఎలా ఉండబోతుందా.. ఇందులో ప్రభాస్‌ని సందీప్ రెడ్డి ఎలా చూపిస్తాడా..? అని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్ రూత్‌లెస్ కాప్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 31న అర్థరాత్రి సమయంలో రిలీజ్ చేసి ప్రేక్షకులకు, అభిమానులకు సాలిడ్ న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేందుకు స్పిరిట్ టీమ్ రెడీ అవుతుంది.

The put up ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేస్తోంది.. హైప్ పెంచేసిన సందీప్ రెడ్డి వంగా first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.