ఏపీ రాష్ట్రంలో రాజీకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ అధికారం కోసం జోరు గా ప్రచారం చేస్తుంటే ప్రతిపక్ష కూటమి కూడా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారం లో అడ్డదారులు తొక్కుతూ ప్రజలను ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. ఏ ముహూర్తాన కూటమి ఏర్పడిందో అప్పుడే తెలుగుదేశం పార్టీకి ప్రతికూలత పెరిగిపోయింది.

రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన టీడీపీ, సెంట్రల్ లో మోసం చేసిన భాజాపా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లు కలవడం తో ప్రజల్లో విరక్తి పుట్టింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలో ఈ ఇంపాక్ట్ బలంగా కనిపిస్తోంది. మొదటినుంచీ వారి కూటమిపట్ల విరక్తి పుడుతుంది. ముఖ్యంగా బీజేపీ, జనసేనకు కేటాయించిన 31 సీట్లలో సరేసరి, అక్కడ కొట్టుకుంటున్నారు. తెలుగుదేశం పోటీ చేసే మిగిలిన 144 స్థానాల్లో కూడా అసంత్రప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

ఇవాళ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్య పై దాడి.. నిన్న హోంమంత్రి తానేటి వనతిపై గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో దాడి.. నిన్ననే విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి.. అంతకుముందు మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో దాడి.. ఇవన్నీ చూస్తుంటే మహిళల పట్ల కూటమికి ఎంతటి మర్యాద ఉందో తెలుస్తుంది. మరి ఇది వారి సీట్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరీ.