కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి తరుపున పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బెట్టింగ్లను నిర్వహించి ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడని అతన్ని ఓడించి కాకినాడ ప్రజలు మేలు చేసుకోవాలంటూ అనంతపురంనకు చెందిన పసుపులేటి పద్మావతి, పసుపులేటి సందీప్ రాయల్ అనే తల్లి కొడుకులు కాకినాడ పార్లమెంట్ ఓటర్లను కోరారు. ఉదయ్ ప్రవర్తిస్తున్న తీరువల్ల, అతను మహిళల పట్ల వ్యవహరించే విధానం అతను చెప్పే మాటలకు చాలా తేడా ఉందన్నారు. అందువల్ల కాకినాడ పార్లమెంట్ తరఫున అభ్యర్థిని మంచి వాడ్ని ఎంపిక చేసుకోవాలని వారు సూచించారు. బుధవారం కాకినాడలోని ఓ హోటల్లో పసుపులేటి సందీప్ రాయల్, పసుపులేటి పద్మావతి విలేకరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ తాను పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్చార్జిగా వ్యవహరించే వారినని అప్పుడు ఉదయ్ తీరు నచ్చక ఎన్నోసార్లు జనసేన అధినేత పవన్ దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఉదయ్ మహిళలను దుర్భాషలాడేవాడని, దాన్ని తాను మందలించడంతో తనపై పార్టీ కార్యాలయం నుంచి తొలగింపు చేసినట్లు సందీప్ చెప్పారు. అలాగే అతను వల్ల సుమారు 42 మంది ఉద్యోగులు తొలగింపు చేసేలా చేశారన్నారు. ఉదయ్ నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలన్నీ తప్పుడు పత్రాలతో నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని కూడా టాక్స్లను ఎగ్గొడతారన్నారు.

అంతే గాక అతనిపై దుబాయిలో కేసు కూడా నమోదు అయిందని ఆరోపించారు. గతేడాది జూన్ 12న హైదరాబాదు పార్టీ కార్యాలయం తగలబెట్టడంలో తంగెళ్ల కీలక పాత్ర పోషించారన్నారు. ఆ విషయాన్ని పవన్ దృష్టికి వెళ్ళనీయకుండా ఎంతో మంచిగా వ్యవహరించేవారన్నారు. ఉదయ్ ఆది నుంచి బ్లాక్ మెయిల్ చేసే విధానం కలిగి ఉన్నాడని సందీప్ చెప్పారు. కాకినాడ ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సందీప్ సూచించారు. ఉదయ్ గురించి ఎన్నో విషయాలు తెలిసినా జనసేనాని పవన్ అతన్ని నమ్మడం చాలా బాధాకరమని తల్లీ, కొడుకులు సందీప్, పద్మావతిలు వెల్లడించారు.