Fri. Jul 31st, 2026
Vijay-Rashmika :రేపే ‘విజయ్ – రష్మిక’ వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!

విజయ్ – రష్మిక..గత కొన్నేళ్లుగా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ జోడీ, ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇద్దరు యువతులు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయగా, అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.

Additionally Learn : Suriya-46 : సూర్య కోసం వెంకీ ‘యూనివర్సల్’ స్కెచ్.. అందరికీ అర్థమయ్యేలా స్పెషల్ టైటిల్!

నిజానికి, 2025 చివరి నాటికి వీరిద్దరూ సన్నిహితుల సమక్షంలో రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఓ సందర్భంలో రష్మిక స్పందిస్తూ.. “సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెబుతాను” అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే, విజయ్ కానీ రష్మిక కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో, ఇది కేవలం సినిమా షూటింగ్ కోసం చేస్తున్న ఏర్పాటా? లేక నిజంగానే పెళ్ళా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఏదేమైనా ‘విజయ్-రష్మిక’ జోడీ పెళ్లి పీటలు ఎక్కితే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this put up on Instagram

A put up shared by means of Tanya ♡ (@tanyaa.yaaa)