తమిళ రాజకీయాల్లో రేపు(మే 10న) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ రేపు (మే 10) తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ వేడుక కోసం సర్వం సిద్ధమైంది.
ఇటీవలి ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్, వీసీకే వంటి మిత్రపక్షాల మద్దతు కూడగట్టడంతో, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తమిళనాడులో దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ సాగుతున్న ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మే 13లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుండటంతో తమిళనాడు అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
The put up అఫీషియల్ : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
