Sat. May 9th, 2026

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు పలు సాలిడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో తన టాక్సీవాలా దర్శకుడు రాహుల్ తో చేస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా “రణబాలి” కూడా ఒకటి. విజయ్ భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ చిత్రంలో విజయ్ వారియర్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ చిత్రం కోసం విజయ్ ఎంతలా కష్టపడ్డాడు అనేది లేటెస్ట్ గా తన బర్త్ డే స్పెషల్ గా వదిలిన వీడియోలో చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాలో దాదాపు విజయ్ పై గుర్రపు స్వారీ సన్నివేశాలు ఎక్కువ మరి దానికి పర్శనల్ ట్రైనింగ్ కూడా తాను తీసుకోగా ఈ స్వారీ సన్నివేశాలు తాను పలుమార్లు పడిపోయి గాయాలపాలయినట్టు ఇందులో చూపించారు.

కానీ ఎక్కడా విజయ్ వెనక్కి తగ్గకుండా అదే గుర్రాన్ని స్వారీ చేసి సీన్స్ ని సాలిడ్ లెవెల్లో పూర్తి చేసినట్టుగా తమ హీరోకి మైత్రి టీం వారు బర్త్ డే విషెస్ చెబుతూ వీడియో వదిలారు. దీనితో ఈ వీడియో చూసిన అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి అజయ్ – అతుల్ లు సంగీతం అందిస్తుండగా ఈ సెప్టెంబర్ 11న పాన్ ఇండియా లెవెల్లో సినిమా రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The publish ‘రణబాలి’ స్పెషల్ వీడియో.. పడి లేచిన కెరటంలా విజయ్ డెడికేషన్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.