పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. త్రిప్తి దిమ్రీ హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్‌రాజ్, గుల్షన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పిరిట్ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారట.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ మొదటిసారి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందుకోసం డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు అత్యంత సహజంగా, గూస్‌బంప్స్ వచ్చేలా ఉండబోతున్నాయట. అందుకే ఒక కీలకమైన ఫైట్ సీన్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారట. దాదాపు 100 మంది ఫైటర్లతో ఫైట్ రిహార్సల్స్ జరుగుతున్నట్టు టాక్. ఈ కొత్త షెడ్యూల్ షూటింగ్ మే 10 నుండి మొదలు కానుందని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అందులోను ప్రభాస్ రిహార్సల్స్ చేస్తున్నాడంటే.. స్పిరిట్ యాక్షన్ బ్లాక్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా వరకు బరువు తగ్గి కనిపిస్తారని, పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుండటంతో ఫిట్‌నెస్‌పై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం ఆయన కఠినమైన డైట్, వర్కౌట్ ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్‌లో ప్రభాస్ మేకోవర్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
