Ram Charan’s Peddi Trailer Unencumber Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అదిరిపోయే ప్లాన్లతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. పెద్ది ట్రైలర్‌ను మే 16న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ట్రైలర్ ఈవెంట్‌ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సహా చిత్ర యూనిట్ హాజరు కానుందని టాక్. నార్త్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ లొకేషన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌ను కేవలం ఒక సినిమా వేడుకలా కాకుండా.. ఒక మ్యూజికల్ ఫెస్టివల్‌లా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నారట.
అయితే పెద్దిట్రైలర్ లాంచ్ డేట్, ఈవెంట్ ఎక్కడ? అనే విషయాల్లో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బుచ్చిబాబు మాత్రం పెద్ది ట్రైలర్‌ను ఓ రేంజ్‌లో కట్ చేసినట్టుగా సమాచారం. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ట్రైలర్ వచ్చాక అది నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందని ఇండస్ట్టీ ఇన్‌సైడ్ టాక్. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న పెద్ది.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
