పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న భారీ చిత్రం కల్కి పార్ట్ 2 కూడా ఒకటి. మొదటి పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టి 1100 కోట్లకి పైగా రాబట్టింది. ఇక దీనితో పార్ట్ 2 కోసం అనేకమంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ పార్ట్ 2 షూట్ కూడా కొన్నాళ్ల కితమే మొదలైంది.
ఇక ఇదిలా ఉండగా కల్కి పార్ట్ 2 రిలీజ్ కి అప్పుడే సమయం లాక్ అయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటి ప్రకారం సినిమా వచ్చే ఏడాది ఆఖరున విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇది అయ్యే పనేనా అంటే దానికి సమాధానం సగం సగమే అనుకోవాలి. నిజానికి నాగ్ అశ్విన్ పార్ట్ 2 తాలూకా పనులు ఎప్పుడో ప్రీప్లాన్డ్ గా చేసి ఉంచారు.
కేవలం నటీనటులు వచ్చి యాక్ట్ చేయడంతో సినిమా పూర్తి అవుతుంది. సో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది నటీనటుల డేట్స్ వారు సినిమా పూర్తి చేయడం మీదనే ఆధారపడి ఉంది. ఇవి త్వరగా అయితే అనుకున్నట్టే వచ్చే ఏడాది ఎండింగ్ కి వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.
The put up ‘కల్కి’ పార్ట్ 2 విడుదల అంత త్వరగానా? అయ్యే పనేనా? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
