హిట్స్‌తో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్స్ ఉన్న హీరోయిన్స్‌లో ‘అస్సాం అందగత్తె’ ‘కాయాదు లోహర్’ ఒకరు. రీసెంట్‌గా వచ్చిన ‘ఫంకీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ, ఆ వెంటనే ‘డ్యూడ్’ మ్యూజిక్ డైరెక్టర్ ‘సాయి అభ్యంకర్’తో చేసిన ప్రైవేట్ ఆల్బమ్ 100 మిలియన్ వ్యూస్ అందుకోవడంతో ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్ భామగా మారింది. అంతేకాదు, నెక్స్ట్ ఆగస్టు మంత్‌లో అయితే ఏకంగా అటు తెలుగుతో పాటు ఇటు మలయాళం భాషలో కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హై బడ్జెట్ మూవీస్‌లో హీరోయిన్‌గా చేస్తూ, టోటల్ ఆగస్ట్ మంత్‌నే తన అందంతో ఆక్రమించేందుకు రెడీ అంటుంది.
ముందుగా ఆగస్టు 21న రిలీజ్‌కి రెడీగా ఉన్న ‘నేచురల్ స్టార్’ నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఈ బ్యూటీకి తెలుగులో రాబోయే ఫస్ట్ సక్సెస్‌గా కనిపిస్తుంటే, అదే నెలలో ఓణం ఫెస్టివల్ కానుకగా మలయాళంలో రాబోతున్న ‘దుల్కర్ సల్మాన్’ ‘ఐ యామ్ గేమ్’ మరో బంపర్ సక్సెస్ ఫిల్మ్‌గా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ‘దుల్కర్ సల్మాన్’ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ గ్యాంగ్‌స్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నది మూడు ఏళ్ల క్రితం ‘RDX’ అనే హిట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ ‘నహాస్ హిదయత్’. పైగా ఈ గ్యాంగ్‌స్టార్ డ్రామాను మునిపెన్నడూ ఏ మలయాళం ఫిల్మ్‌కు ఎవరు చేయని విధంగా వందకు పైగా డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్‌తో పాటు హై బడ్జెట్‌తో ‘దుల్కర్’ నిర్మించారంట. దీంతో అక్కడ ‘దుల్కర్’తో, ఇక్కడ ‘నాని’తో చేస్తున్న ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు హిట్స్ అవుతే మాత్రం ‘కాయాదు’ కెరీర్‌కు తిరుగు ఉండదు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూడాలి మారి కాయాదు కష్టం కలిసి వస్తుందో లేదో?
