Mon. Jun 29th, 2026

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.

నాగబంధం ప్రాజెక్టులోకి మీరు ఎలా వచ్చారు?

సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా రన్ చేసి ఎగ్జిట్ అయ్యాక, బిజినెస్‌ను విస్తరించే క్రమంలో సినిమా రంగాన్ని ఎంచుకున్నాం. మొదట పెద్ద హీరోతో చేయాలనుకున్నా కుదరలేదు. ఆ తర్వాత దర్శకుడు అభిషేక్ నామా చెప్పిన విజువల్స్, స్క్రిప్ట్ విజన్ బాగా నచ్చాయి. కేవలం పేరు కోసం కాకుండా క్రియేటివ్ ఫీల్డ్‌పై ఉన్న ఆసక్తితో, కథను నమ్మి ఏకంగా రూ. 110 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను నిర్మించాము. ఈ చిత్రాన్ని జూలై 3న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం.

ఈ సినిమా హీరో-డైరెక్టర్ ఇద్దరూ కొత్తవారే. మరి ఇంత భారీ బడ్జెట్ ఎందుకు..?

మాకు మొదటి నుంచి లార్జర్ దాన్ లైఫ్ మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్ కథతో సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. ‘నాగబంధం’ కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉంది. గతంలో ‘డెవిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అభిషేక్ నామా చేసిన అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్, ఆయన విజన్ బాగా నచ్చాయి. ఇక ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఐడెంటిటీ అయిన హీరో విరాట్ కర్ణ అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో, ఎంతో అంకితభావంతో పనిచేశారు.

ఫైనల్ అవుట్‌పుట్ చూసి సంతృప్తిగా ఉన్నారా?

సినిమా అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాము. విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మేము ఊహించిన దానికంటే సినిమా చాలా గొప్పగా వచ్చింది. పెట్టిన ప్రతి రూపాయి తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ‘నాగబంధం’ నిజంగా ప్రేక్షకులకు ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా నిలుస్తుంది.

మీరు బిజినెస్ విషయంలో ఎవరి సహాయం తీసుకున్నారు?

మేము ఇండస్ట్రీకి కొత్తవారిమే అయినప్పటికీ దర్శకుడు అభిషేక్ నామాకు ఉన్న అవగాహన, సపోర్ట్ వల్ల సినిమాను అద్భుతంగా నిర్మించాము. అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం వినూత్నంగా చేపట్టిన ‘అనంత పద్మనాభస్వామి రథయాత్ర’ అందరినీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి ప్రమోషన్ చేయలేదని ప్రశంసలు వస్తున్నాయి.

ఈ సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లు ఏమిటి?

ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా కోసం భారీ సెట్లను ఎంతో శ్రద్ధగా రూపొందించాం. అయితే ఎక్కడ వరకు సెట్లు వేయాలి, ఎక్కడ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించాలి అనే నిర్ణయం తీసుకోవడం మాకు పెద్ద సవాలుగా అనిపించింది. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్ కనిపిస్తుంది. అలాంటి అవుట్‌పుట్ అవుట్‌డోర్‌లో సాధ్యం కాదనే భారీ వ్యయంతో ఈ సెట్లను నిర్మించాము.

పాన్ ఇండియా ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి?

ప్రతి భాష నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. కొత్త స్టార్‌కాస్ట్ అయినప్పటికీ కంటెంట్, విజువల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకులు కూడా ట్రైలర్ చూసి చాలా ప్రామిసింగ్‌గా ఉందంటూ ప్రశంసించారు. మార్కెటింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నాం.

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా?

ఈ సినిమా మేము ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే కచ్చితంగా సీక్వెల్ రూపొందించే ఆలోచన ఉంది.

The put up ఇంటర్వ్యూ : నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి – ‘నాగబంధం’ ఒక విజువల్ ఫీస్ట్..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.